నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కేటి దొడ్డి ఎంపీహెచ్ఎస్, యుపిఎస్ గువ్వలదిన్నె వాగుల తండా నందిన్నె పలు పాఠశాలలో కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు కేటి దొడ్డి ప్రధానోపాధ్యాయులు మురళి ఆయా పాఠశాల ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమం సందర్భంగా 1 తరగతి చిన్నారులకు పలకలపై అక్షరాలు రాయించి స్థానిక మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు అక్షరాభ్యాసం చేయించారు *ఈ సందర్భంగా కేటిదొడ్డి మండల విద్యాశాఖ *అధికారి* *వెంకటేశ్వరరావు మాట్లాడుతూ* ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యా అర్హతలు సుశిక్షితులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తారని తెలియజేస్తూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిలుపునిచ్చారు అదే విదంగా ఆయ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు బట్టలు పంపిణీ చేశారు అదే విదంగా మహిళా సమైక్య ఆఫీస్ యందు స్టిచ్చింగ్ చేసిన బట్టలను పరిశీలించి త్వరగా ఆయా పాఠశాలలకు పంపిణీ చేయాలని ఆదేశించారు అదే విధంగా పై తరగతులకు ఆయ పాఠశాలలో అడ్మిషన్స్ తీసుకున్నారు….ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సి ఆర్ పి లు పాపయ్య, యుగేందర్, శివరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.

