Thursday, March 12, 2026

చిన్నారుల ఎదుగుదలకు…పోషకాహారం అందించాలి

నేటిసాక్షి, మిర్యాలగూడ : ఐసిడిఎస్ అర్భన్ ప్రాజెక్ట్ పరిధిలో “సెప్టెంబర్ -17 నుండి అక్టోబర్-16” వరకు నిర్వహిస్తున్న పోషణ మాసం కార్యక్రమాలల్లో భాగంగా అర్భన్ సిడిపిఓ మమత ఆదేశాల మేరకు సోమవారం మండల పరిధిలోని అన్నారం సెక్టార్ పరిధిలోగల వెంకటాద్రిపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలాల్లో భాగంగా సూపర్వైజర్ రాధిక మాట్లాడుతూ, చిన్నారులు తిసుకునే పోషకాహారం, రక్తహీనతకు గురి కాకుండా తీసుకునే ఆహారాలు గురించి, తల్లులు, పిల్లలకి, అలాగే కిశోర బాలికలు రుతుచక్రం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు బి.సాగరయ్య మాట్లాడుతూ, పిల్లలు అందరూ చిరు ధాన్యాలు పైన అవగాహన కలిగి ఉండాలని, కేవలం వరి అన్నమే కాకుండా, అన్ని రకాల చిరు ధాన్యాలు పోషకాహారంగా తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు కవిత, సునీత, శారద, యశోద, నసీమా, సుల్తానా, ఆయమ్మ, సైదమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు దస్తగిరి శైలజ, గ్రామస్తులు, తల్లులు మరియు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News