నేటి సాక్షి న్యూస్ ప్రతినిధి చేవెళ్ల న్యూస్ చేవెళ్ల బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఇద్దరు చిన్నారుల కోసం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ముందుకు వచ్చి ఉదారత చూపారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందప్ప, లక్ష్మీ దంపతులు అమానుష ప్రమాదంలో మృతిచెందడంతో వారి కుమార్తెలైన భవానీ, శివలీల అనాథలయ్యారు. ఈ ఘటన వివరాలు ”చేవెళ్ల న్యూస్” వాట్సాప్ గ్రూపులో చర్చకు రావడంతో చిన్నారుల పరిస్థితి అందరినీ కలిచివేసింది. పరిస్థితిని తెలుసుకున్న కార్తీక్ రెడ్డి పిల్లల భవిష్యత్తు, చదువు, సంరక్షణ కోసం రూ.2లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన చేసిన ఈ సేవా కార్యక్రమం గ్రూప్ సభ్యులతో పాటు స్థానిక ప్రజల ప్రశంసలను పొందుతోంది. ఇలాంటి మానవీయ స్పందన సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. చిన్నారుల భవిష్యత్తుకై మరింత మంది ముందుకు రావాలని “చేవెళ్ల న్యూస్” గ్రూప్ తరఫున పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపునిచ్చారు. అదే సమయంలో వారి తరఫున కార్తీక్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.





