Wednesday, July 23, 2025

చిన్న హాస్పిటల్స్ ను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు

ఇలా చేస్తే రాష్ట్ర,దేశాలలో చిన్న హాస్పిటల్స్ కనుమరుగైపోతాయి* *హాస్పిటల్స్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది**ప్రజల ప్రాణాలను కాపాడేందుకే వైద్యులు ఉన్నది* *అప్నా వైద్యులకు అండగా ఉంటుంది* *హాస్పిటల్స్ స్థాపనను అడ్డుకుంటే ఊరుకోం* *అప్నా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఏ.వి సుబ్బారెడ్డి* *కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన అప్నా నేతలు* నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)*తిరుపతి:*ప్రజలకు అత్యంత చేరువలో ఉండే చిన్న హాస్పిటల్స్ ను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని,అత్యవసర సమయంలో మొదట చిన్న హాస్పెటల్సే ఉపయోగపడతాయన్న విషయాన్ని ప్రజలు ఆలోచించి చిన్న హాస్పిటల్స్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్(అప్నా) రాష్ట్ర అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్స్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ ఏ.వి సుబ్బారెడ్డి కోరారు.జూన్ 9వ తేదీ సోమవారం తిరుపతిలోని ఓ 20 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని ఆపాలని వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం అప్నా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సుబ్బారెడ్డి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ డాక్టర్ జనార్దన్,తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ రవిరాజు, కార్యదర్శి డాక్టర్ మారుతి కృష్ణ, కోశాధికారి డాక్టర్ దామోదర్ తో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్స్, వైద్యులు ఉన్నది ప్రజల ప్రాణాలను కాపాడేందుకే తప్ప,వారిని ఇబ్బంది పెట్టేందుకు కాదని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి వైద్యులకు అండగా ఉండాలన్నారు.నియమ నిబంధనల ప్రకారం నిర్మిస్తున్న 20 పడకల ఆసుపత్రిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.కొంతమంది స్వలాభాల కోసం హాస్పిటల్స్ ను అడ్డుకోవడం వలన రానున్న రోజులలో రాష్ట్రలోనే కాదు దేశాలలో కూడ చిన్న ఆసుపత్రులు అనేవి లేకుండా కనుమరుగై పోతాయని గుర్తు చేశారు.మన పరిసర ప్రాంతాలలో చిన్న ఆసుపత్రిలు ఉండడం వలన అత్యవసర సమయంలో అవసరమైన వైద్యం అందించడమే కాక పెద్ద ఆసుపత్రికి వెళ్లే లోపు రోగికి కావలసిన కనీస వైద్యాన్ని పొందగలమన్న విషయాన్ని గ్రహించాలన్నారు.ఈ రోజుల్లో రూరల్,ఏరియాలలో,తాలూకా హెడ్ క్వార్టర్లలో కానీ,చిన్న చిన్న పట్టణాలలో కానీ వైద్యం అందరికీ అందుబాటులో ఉండేది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మరియు ఈ చిన్న హాస్పిటల్స్ అన్నారు. డాక్టర్లకి ఏమీ వాళ్లు ఎంతో బాగా సంపాదిస్తానన్నారు అన్నది ఒకప్పటి మాట,ప్రస్తుతం దాదాపు 50 శాతం హాస్పిటల్స్ నష్టాల్లోనే నడుస్తున్నాయని,తాము చేసిన వృత్తికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఎంతోమంది వైద్యులు వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని,అలా కాదని హాస్పిటల్ స్థాపనను వ్యతిరేకిస్తే నష్టపోయేది మనమే అన్న విషయాన్ని గ్రహించాలన్నారు.అలా చేస్తే అప్నా చూస్తూ ఊరుకోదని,వైద్యులకు అప్నా ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నామన్నారు.అదేవిధంగా దేనిని కమర్షియల్ చేయాలి,దేనిని నాన్ కమర్షియల్ చేయాలి అన్న విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టి 20 బెడ్లు,20 కంటే తక్కువగా ఉన్న బెడ్లకు రూల్స్ సరళతరం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు.వచ్చిన ఫిర్యాదు పై వెంటనే స్పందించి దాని నియమ నిబంధనలు తెలుసుకొని సమస్య పరిష్కరించిన కమిషనర్ కు ఈ సందర్భంగా అప్నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన తెలియజేశారు.అనంతరం అప్నా జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్ రవిరాజు,డాక్టర్ మారుతి కృష్ణ మాట్లాడుతూ మన కాలనీలో హాస్పిటల్ వస్తే మనకే మంచిది అన్న విషయం ప్రజలు గ్రహించాలన్నారు.స్కూల్స్, అపార్ట్మెంట్స్,షాపింగ్ కాంప్లెక్స్లు లాంటి వాటికి లేని అభ్యంతరాలు మన ప్రాణాలను కాపాడే హాస్పిటల్స్ కు వచ్చిందా అని ఆవేదన వ్యక్తం చేశారు.మన ప్రాంతంలో హాస్పిటల్స్ కావాలి అని అడగాలి తప్ప వద్దు అనడం సరైన పద్ధతి కాదని,హాస్పిటల్స్,వైద్యుల సమస్యలపై తాము ప్రభుత్వంతో కూడా ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. *నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయి- కమిషనర్*ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదు మేరకు హాస్పిటల్ స్థాపనకు కావలసిన నియమ నిబంధనలన్నీ ఎంక్వయిరీ చేయడం జరిగిందన్నారు.ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉండడంతో హాస్పిటల్ నిర్మాణం కొనసాగించేందుకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని కమిషనర్ మౌర్య తెలిపారు.ఫోటో రైటప్: కమిషనర్ కు వినతిపత్రం అందజేస్తున్న అప్నా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఏ.వి సుబ్బారెడ్డి తదితరులు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News