నేటి సాక్షి,గన్నేరువరం ( బుర్ర అంజయ్య గౌడ్)గన్నేరువరం మండల పరిధిలోని చీమలకుంటపల్లి గ్రామంలో గురువారం డాక్టర్ సురేందర్, ఎల్ ఎస్ ఎ విజయ భాస్కర్ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టాల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సర్పంచ్ జంగిటి ప్రకాష్ పాల్గొని గొర్రెలకు నట్టాల నివారణ మందు వేశారు .అనంతరం మాట్లాడుతూ పశువులు ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశువుల ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. పాడి, గొర్రెలు, కోళ్ల రైతులు సీజనల్ వ్యాక్సిన్లు, నట్టాల నివారణ మందులు, లివర్, కాల్షియం టానిక్‌లను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రవళిక , తుమ్మ ప్రభాకర్, రాజయ్య, ఓ ఎస్ ఆంజనేయులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

