నేటి సాక్షి, తిమ్మాపూర్:ఆకాశంలోని చుక్కలన్నీ.. నేలమీదకు జారి ముగ్గులైనట్లుగా మారింది అలుగునూర్ గ్రామంలోని రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణం. గ్రామంలోని పారమిత విద్యాసంస్థల ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించగా, గ్రామ యువతులు.. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 30కి పైగా మంది పోటీలో పాల్గొని అందమైన ముగ్గులు వేయగా, వాటిలో మొదటి ఐదింటికి బహుమతులు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కన్సొలేషన్ ప్రైజ్లు అందించారు. పారమిత ప్రిన్సిపాల్ శ్రీకర్, తిమ్మాపూర్ మండల ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ బత్తుల రాకేశ్, గ్రామ పెద్దలు జేవీ మల్లారెడ్డి, జాప రవీందర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

