Wednesday, March 4, 2026

*చెడుపై మంచి సాధించిన విజయం**ఎస్ఐ వి గోవర్ధన్*

నేటి సాక్షి, నల్లబెల్లి చెడుపై మంచి సాధించిన విజయమే హోలీ అని ఎస్సై గోవర్ధన్ అన్నారు. స్థానిక విలేకరులతో కలిసి మంగళవారం ఆయన హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….భారతీయ సంస్కృతిలో పండుగలు కేవలం సంబరాలకు మాత్రమే పరిమితం కావని అవి మన ఆత్మను, ఆచారాలను, ఆలోచనలను తీర్చిదిద్దే ఆధ్యాత్మిక పాఠాలుగా నిలుస్తాయన్నారు . అలాంటి మహోన్నత పండుగల్లో ‘హోలీ’ ఒకటని శిశిర ఋతువుకు వీడ్కోలు పలుకుతూ వసంతాన్ని ఆహ్వానించే ఈ రంగుల పండుగ, భారతీయ జీవన శైలిలో ఆనందం, ఐక్యత, భక్తి అనే విలువలను సమగ్రంగా ప్రతిబింబిస్తుందన్నారు.హోలీ పండుగకు ఆధారం ప్రహ్లాద–హిరణ్యకశిపుడు–హోలిక పురాణ గాథని అహంకారానికి ప్రతీకగా నిలిచిన హిరణ్యకశిపుడి దురహంకారాన్ని, భక్తి శక్తి ఎలా జయించిందో ఈ కథ తెలియజేస్తుంధన్నారు.హోలిక దహనం ద్వారా చెడుపై మంచికి జయమనే సందేశం తరతరాలకు అందుతోందని ఈ గాథ భక్తి పరాక్రమాన్ని మాత్రమే కాకుండా, అధికార దుర్వినియోగం ఎంత శక్తివంతమైనదైనా సత్యం ముందు నిలబడలేదనే నైతిక బోధనను కూడా ఇస్తుందన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News