నేటిసాక్షి, రాయికల్ :
రాయికల్ పట్టణంలో చెత్త సేకరణను నిలిపివేయడంతో వార్డులు కంపు కొడుతున్నాయని తక్షణం చెత్త సేకరణ చేపట్టాలని బిఆర్ఎస్పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు గురువారం రాయికల్ మున్సిపల్ కమిషనర్మనోహర్కు వినతిపత్రం అందజేసారు. బిఆర్ఎస్ హాయంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆరు ఆటోలు, ఒక ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేపట్టామని వివరించారు. ప్రస్తుతం ఏలాంటి ఆటోలు, ట్రాక్టర్లు అనుకున్న మేర తిప్పడం లేదని దాంతో వార్డులు చెత్తతో కంపుకొడుతున్నాయని తక్షణం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చెత్త సేకరణ చేపట్టాలని వినతి పత్రంలో కోరారు. రానున్న వానకాలం దృష్ట్యా పచ్చదనం, పరిశుభ్రతకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎలిగేటి అనిల్, కార్యదర్శి మహేష్గౌడ్, సత్యనారాయణ, తాజా మాజీ కౌన్సిలర్లు తురగ శ్రీధర్రెడ్డి, కన్నాక మహేంధర్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్: 19RKL01:కమిషనర్కు వినతిపత్రంఅందజేస్తున్న దృశ్యం

