నేటి సాక్షి చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77వ,గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనులు, ఉపాధి శాఖామంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించిందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, దేశాభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, యువత, పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు,అధికారులు, కార్యకర్తలు, పాల్గొన్నారు





