నేటి సాక్షి చెన్నూర్ లో వివేక్ వెంకటస్వామి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూమంత్రి మాట్లాడుతూ చెన్నూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించి మున్సిపాలిటీలో బాధ్యతలు అప్పగించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ కౌన్సిలర్లు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి, వారి సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించే దిశగా పని చేయాలని సూచించారు.చెన్నూరు మున్సిపాలిటీలో సుమారు రూ.50 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అనేక వార్డుల్లో బోర్‌వెల్స్, సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమృత్ 2.0 పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందజేస్తామని హామీ ఇచ్చారు.గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరిట నిధులను దుర్వినియోగం చేసిందని విమర్శించిన మంత్రి, చెన్నూరు పట్టణ ప్రజలకు గోదావరి నుంచి శుద్ధజలాల పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. త్వరలో పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు కూడా చేపడతామని వెల్లడించారు అనంతరంపట్టణంలోని కుల సంఘాల భవనాల నిర్మాణానికి ఇప్పటికే నిధులు కేటాయించినట్లు తెలిపారు. మరో ఆరు నెలల్లో గోదావరి ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మారెమ్మవాడలో రహదారి సమస్యను పరిష్కరించామని గుర్తు చేస్తూమున్సిపాలిటీలో 100 కొత్త ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై కేబినెట్లో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. దేవులవాడ, బబ్బేరు, చెలుక గ్రామాల రైతులకు సుమారు రూ.18 కోట్ల పరిహారం మంజూరు చేసి పంపిణీ చేసినట్లు వివరించారు.మే నెలలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కోటి ఇరవై లక్షల రూపాయలతో శ్మశానవాటిక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.చెన్నూరు మున్సిపాలిటీనీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.





