నేటి సాక్షి, చెన్నూర్: చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఆదేశాల మేరకు చెన్నూర్ నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో చెన్నూర్ క్యాంప్ ఆఫీసులో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టం అధ్యక్షుడు చెన్నసూర్య, మండల మాజీ అధ్యక్షుడు గజ్జల అంక గౌడ్, చెన్నూర్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి బొడ్డు రాకేశ్, మంత్రి లక్ష్మణ్, చిర్ల సుధాకర్ రెడ్డి, పాతర్ల నగరాజ్, లింగంపల్లి మహేశ్, సుల్తాన్, కమలాకర్, సుమంత్, దుర్గాప్రసాద్, బనేశ్, మంతు, గండ్రకోట రవి, తగారం కృష్ణ, నగరాజ్, శ్రవణ్, మధు, షాహీర్, అశోక్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.