నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి మార్చి 3 చెరువులో పడి ఓ వ్యక్తి అనుమానాతస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మంగళవారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది ,కుటుంబ సభ్యులు గ్రామస్తుల కథల మేరకు… మండలంలోని కాటిపేరు పంచాయతీ పలగార్లపల్లికి చెందిన, వెంకటరమణ 48 వ్యవసాయ కూలీల జీవిస్తున్నాడు ఈ క్రమంలో గత రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికిన ప్రయోజనం లేకపోయింది .కాగా మంగళవారం సాయంత్రం పలగార్లపల్లి షుగర్ ఫ్యాక్టరీకి వెళ్లే మార్గంలో గల ఒక చెరువులో శవమై తేలాడు గుర్తించిన స్థానికులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు





