Wednesday, March 11, 2026

చెరువు మట్టి మాఫియాకు అడ్డాగా కూసుమంచి మండలం..

విచ్చలవిడి చెరువు మట్టి దందా..

అనుమతుల పేరుతో పొలాల్లో మట్టి డంపు..

జెసిబిలను ఉపయోగిస్తూ మట్టి దందా..

అదును చూసి ట్రాక్టర్ ట్రిప్పు 1000 నుండి 1500 వందల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు..

కనీసం పట్టింపులేని ఇరిగేషన్ అధికారులు..

బైండోవర్ కేసులు ఉన్న భయమే లేని జేసిబి ఓనర్లు..

నేటి సాక్షి పాలేరు , జూలై 6 :

గతంలో మట్టిని నమ్ముకుని వ్యవసాయం చేసిన రోజులు చూశాము.. ఇప్పుడు అదే మట్టి అమ్ముకుంటూ దందా చేస్తూ లక్షల రూపాయల ఆదాయం సొమ్ము చేసుకుంటున్న రోజులు చూసే పరిస్థితులు దాపురించాయి.. నేడు అది కూడా చూస్తున్నాం.. వారి దందాకు చెరువులకు చెరువులు ప్రమాదపు అంచున ఉన్నాయి.. జేసీబీ ఓనర్ల అత్యాశ చెరువులు , కుంటలు మట్టి దందాకు అడ్డాలుగా మారాయి.. కూసుమంచి మండలంలో మట్టి మాఫియాకు ఇప్పుడు అడ్డు అదుపు లేదనే చెప్పాలి.. పొలాల్లోకి ఎరువుగా చెరువు మట్టి తొలుకుంటాం అనే అరకొర అనుమతులతో ఏకంగా పగలు , రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా మట్టి మాఫియాకు తెరతీశారు.. ఆదివారం కూసుమంచి మండల పరిధిలో వ్యవసాయ పొలాల్లో ఉన్న చెరువు మట్టిని తరైస్తున్నారు… గతంలో పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో వందల ట్రిప్పుల మట్టిని వ్యవసాయ భూమిలో డంప్ చేసి తమకు అనుకూలమైన సమయంలో చెరువు మట్టిని జెసిబి లను ఉపయోగిస్తూ ట్రాక్టర్ల సహాయంతో మట్టిని వ్యాపారంగా మార్చి అమ్ముకుంటూ దందా చేస్తున్నారు.. ఈ మట్టి మాఫియాకు ఎదురే లేదు అన్నట్టు వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది .. ఈ దందాకు జెసిబి ఓనర్లే ప్రధాన కారణం అనే విషయం బహిరంగ రహస్యం.. అయిన వీరి దందాపై అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు..

అనుమతుల మాటున పొలాల్లో మట్టి డంప్. .

చేను,చేలక పొలాల్లో ఎరువు కోసం చెరువు మట్టిని రైతులు ఉపయోగిస్తారు.. దీని కోసం ఎకరాకు 10 లేదా 20 ట్రిప్పులకు ఇరిగేషన్ అధికారుల నిఉంది అనుమతులు తీసుకుంటారు.. ఇదే అదునుగా భావించిన జెసిబి ఓనర్లు అనుమతుల పేరుతో వ్యవసాయ పొలాల్లో వందల ట్రిప్పుల చెరువు మట్టిని డంప్ చేస్తున్నారు.. డంప్ చేసిన మట్టిని వ్యాపారంగా చేస్తూ లక్షల రూపాయల ఆదాయం సొమ్ము చేసుకుంటున్నారు..

బైండోవర్ కేసులకు మాకు యేలా భయం..

కూసుమంచి మండలంలో గతంలో మట్టిని వ్యాపారంగా చేస్తున్న జెసిబి ఓనర్లపై మండల తహశీల్దార్ సమక్షంలో బైండోవర్ కేసులు నమోదయ్యాయి.. కేసులు నమోదు చేస్తూ మరల అనుమతులు లేకుండా మట్టి మాఫియాకు దిగితే కఠిన చర్యలు తప్పవని ,అవసరం ఐతే జెసిబిని సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు తప్పవని జెసిబి నిర్వాహకులను హెచ్చరించారు.. అయిన నాలుగు రోజులు ఆగినట్టే ఆగి మరల మట్టి మాఫియాకు తెరతీశారు.. దీంతో మాకు బైండోవర్ కేసులతో భయం యేలా అన్నట్టు ఉంది వారి తీరు.. వారి మాఫియాను అదుపు చేసేందుకు చర్యలు తుతూ మంత్రంగానే ఉన్నాయి.

ఇరిగేషన్ అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు ..

మట్టి మాఫియాకు ఇరిగేషన్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి .. ముడుపులు చెల్లించుకున్నారు అందుకే జెసిబి ఓనర్లు ఒక్క మాట చెపితే చాలు అరకొర అనుమతులు వాటంతట అవే వస్తాయి అనుకోవడం కోస మెరుపు.. మట్టి దందాపై ఎవరైనా అధికారులకు పిర్యాదులు చేసిన ఇరిగేషన్ అధికారులు తమకేమీ పట్టనట్లు చూసి చూడనట్టు వ్యవహరిస్తారు అనే ఆరోపణలకు బలం కూడా ఉన్న అనేక సంఘటనలు ఉన్నాయి.. లక్షల రూపాయల ఆదాయం సొమ్ము చేసుకుంటున్నారు అనే విషయం తెలిసిన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో మట్టి మాఫియాకు ఇరిగేషన్ అధికారుల సహకారంపై అనుమానాలు తలెత్తుతున్నాయి..

మట్టి మాఫియాతో మత్స్యకారుల జీవితాలకు తలకొరివి..

చెరువులకు మనిషికి విడతీయలేని అనుబంధం ఉంది. ఏళ్లనాటి చరిత్ర కలిగిన చెరువులు ఇప్పుడు మట్టి మాఫియా వలన ప్రమాదపు అంచున ఉన్నాయి.. దీంతో మత్స్యకారుల బ్రతులను కూడా ప్రభావితం చేస్తున్నారు. విచ్చలవిడి చెరువు మట్టి దందా వలన ఎక్కడికక్కడ చెరువులను తవ్వడంతో , చెరువులలో చేపల పెంపకానికి అడ్డుగా మారింది.. ఇటీవల చెరువుల్లో చేపల ఎదుగుదల సరిగ్గా లేదని మత్స్యకారుడు చెప్పడం కోస మెరుపు.. దానికి ప్రధాన కారణం మట్టి మాఫియానే అనేది కఠోర సత్యం.. మట్టి మాఫియా ధనదాహం వలన చెరువుల్లో త్వరగా నాచు పెరిగే పరిస్థితి లేకపోవడమే దీనికి కారణం.. దీంతో మత్స్యకారుల జీవితాలను కూడా ప్రభావితం చేసింది మట్టి మాఫియా. ఇకనైనా అధికారులు స్పందించి మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News