Thursday, July 24, 2025

చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై చంద్రగిరి రగులుతోంది..ఎస్వీ యూనివర్సిటీ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు..అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన వైసిపి నేతలు

నేటి సాక్షి; తిరుపతి జిల్లా (బాదూరు బాల) చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. సేవ్‌ డెమొక్రసీ.. సేవ్‌ ఏపీ.. వి సపోర్ట్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ముందున్న అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఏపీలో అంబేద్కర్‌ రాజ్యాంగం కాకుండా రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి అరెస్టులు కూటమి ప్రభుత్వ అరాచకాలకు పారాకాష్టగా భావిస్తున్నామని, అంబేద్కర్‌ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టును సంఘటితంగా ఎదుర్కొంటామని, ఆయనకు ఏ సబంధంలేని లిక్కర్‌ స్కాంలో అక్రమంగా అరెస్టు చేసిన చెవిరెడ్డి అతి త్వరలో కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. అరెస్టులతో చెవిరెడ్డిని భయపెట్టలేరని, ఉధ్యమమే ఊపిరిగా పెట్టుకున్న నాయకుడు చెవిరెడ్డి అన్నారు. అసలు చెవిరెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు.. చంద్రగిరి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నందుకు అరెస్టు చేశారా..? కరోనాలో పార్టీలకు అతీతంగా అందరినీ కాపాడినందుకు అరెస్టు చేశారా..? పండుగలు వస్తే ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులా కానుకలు పంపించి ప్రజల కళ్లలో ఆనందం చూసినందుకు అరెస్టు చేశారా..? కోట్ల రూపాయలు ఖర్చు చేసి పల్లె ప్రగతిని పరుగులు పెట్టించినందుకు అరెస్టు చేశారా..? దేనికోసం..? సిట్‌ అధికారులు ఎవ్వరి కళ్లలో ఆనందం చూడటానికి ఇదంతా చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెవిరెడ్డికి ఆయన కుటుంబానికి అండగా నిలబడి సైనికుల్లా పనిచేస్తామని స్పష్టం చేశారు. *చెవిరెడ్డి ఇంటికి చేరిన నేతలు, కార్యకర్తలు*సిట్‌ అధికారులు అక్రమంగా చెవిరెడ్డిని అరెస్టు చేయడంతో ఆ కుటుంబానికి మేమున్నామని భరోసా కల్పించేందుకు చంద్రగిరి నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇంటి వద్దనున్న చెవిరెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీకి, తల్లి మునిరాజమ్మలకు ధైర్యం చెప్పారు. అన్న తిరిగి ఇంటికి వచ్చేంత వరకు తామంతా ఆ కుటుంబానికి అండగా నిలబడి పోరాటాలు చేస్తామని ప్రతిన బూనారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు దామినేటి కేశవులు, చిన్ని యాదవ్,మల్లం చంద్రమౌళి రెడ్డి, నంగా నరేష్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, పూతలపట్టు లోక,హేమేంద్రికుమార్ రెడ్డి,యెద్దుల చంద్రశేఖర్ రెడ్డి, డిల్లీ భాను కుమార్ రెడ్డి, యశోదమ్మ,దీపికా చంద్రమౌళి రెడ్డి,మొక్కల భారతి, మొక్కల తిమ్మారెడ్డి, నెల్లేపల్లి వెంకటేష్, విడుదల మాధవ రెడ్డి, శివశంకర్, శివశంకర్ రాజు,మల్లారపు శ్రీరాములు,మల్లారపు వాసు, సాంబయ్య యాదవ్,ముచ్చేలి భాస్కర్ రెడ్డి, చంద్రబాబు, ఓబుల్ రెడ్డి,చెంగల్ రెడ్డి,డాక్టర్ జయకర్, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News