నేటి సాక్షి తిరుపతి *తిరుపతి రూరల్* చంద్రగిరి నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని గురువారం పలువురు రజక సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్రమ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి ఆరోగ్యం గురించి అడగి తెలుసుకున్నారు. రాజకీయ కక్షలతో చంద్రబాబు ప్రభుత్వం చెవిరెడ్డి కుటుంబాన్ని ఇంతలా వేదించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని కలసిన వారిలో రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, ఏపీ రజక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మీసాల రంగన్న, రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రజక విభాగం అధ్యక్షులు పన్నీటి కాశయ్య, వైఎస్‌ఆర్సిపి కడప జిల్లా ప్రచార కమిటీ ఉపాధ్యక్షులు గోటూరి వెంకటేష్, పీలేరు మార్కెటింగ్ కమిటీ మాజీ సభ్యులు మద్దిరాల మల్లికార్జున, రణధీరపురం ఉపసర్పంచి మల్లెమొగ్గల ఉమాపతి, తిరుపతి రూరల్ బిసి సెల్ నాయకులు బెల్లంకొండ అంజి, చిత్తూరు జిల్లా వైఎస్‌ఆర్సిపి రజక విభాగం అధ్యక్షులు బి ఎన్ ప్రకాష్‌లు వున్నారు.

