నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. జోన్ – 4 కింద ప్రకాశం, ఎస్పీఎస్ నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిని నియమించారు. ఆ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడటంతో పలువురు పార్టీ నేతలు, విద్యార్థి విభాగం నేతలు పెద్ద ఎత్తున చెవిరెడ్డి నివాసంకు చేరుకుని చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో పాటు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిలను శాలువలు, గజమాలలతో ఘనంగా సత్కరించారు. అంతకు ముందు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసిన విద్యార్థి విభాగం నేతలతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేఖిస్తూ చేపట్టాల్సిన కోటి సంతకాల సేకరణ ను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ నేతలతో కలసి విద్యార్థి సంఘం నేతలు ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘం నేతలు పాల్గొన్నారు.





