నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*తిరుపతి రూరల్*రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. చంద్రగిరి నియోజక వర్గం పరిధిలోని పార్టీ నేతలు, యువకులు, విద్యార్థి విభాగం నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘనంగా సత్కరిస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి రూరల్ తుమ్మలగుంట గ్రామంలోని చెవిరెడ్డి నివాసం వద్దకు శుక్రవారం చేరుకున్న రామచంద్రాపురం మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వల్లేటి భాను కుమార్ రెడ్డి,నాదెండ్ల గోపి నాథ్ చౌదరి, చిరంజీవి నాయుడు, ఓబుల్ రెడ్డి,ఇరగరెడ్డి, కేశవులు రెడ్డి, రమేష్ లు తమ అభిమానాన్ని చాటుకునేందుకు వచ్చి గజ మాలలతో సత్కరించారు.





