*నేటి సాక్షి, ఎండపల్లి:* మండలంలో పలు గ్రామాల్లో అనేక తాగునీటి చేతి పంపులు మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారాయి. గ్రామ పంచాయతీల్లో నిధులు లేవనే కారణంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మండలంలోని గుల్లకోట గ్రామ పరిధిలోని కొండాపూర్ రోడ్డు పక్కన సలంద్రి మర్రి ప్రాంతంలో ఓ చేతి పంపు దుస్థితి. ఇది పాడై చాలా రోజులు గడుస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. దీనిని వినియోగంలోకి తెస్తే గౌడ సోదరులకు, పాదచారులకు, ఓపెన్ జిమ్ కు వచ్చే వారి దాహర్తి తీర్చేందుకు ఉపయోగ పడుతుంది. వెంటనే సంబందిత పంచాయితీ, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు స్పందించి చేతి పంపు మరమ్మత్తులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, పంచాయతీలలో నీటి వనరుల నిర్వహణకు నిధులు లేకపోవడం లేదా ఉన్న నిధులను సరిగ్గా ఖర్చు చేయకపోవడం వలన చేతి పంపుల మరమ్మతులపై దృష్టి సారించడం లేరు. పంచాయితీ ప్రజాప్రతినిధులు లేకపోవడం, అధికారులు ఫిర్యాదులు అందుకున్నా సకాలంలో స్పందించక పోవడంతో చేతి పంపులు అలంకార ప్రాయంగా మారినాయనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.





