నేటి సాక్షి, నారాయణపేట, జనవరి 3, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్),చేనేత కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు.నారాయణపేట చేనేత క్లస్టర్ పథకంలో ( ఎన్ హెచ్ డి పి ) భాగంగా శనివారం మగ్గములు, పరికముల పంపిణీ కార్యక్రమం చేనేత మరియు జౌళి శాఖ వారు నిర్వహించగా డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ చేనేత కళాకారులను ఉద్దేశిస్తూ నారాయణపేట చేనేత వస్త్రాలకు దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్నదని తెలియజేశారు. క్లస్టర్ పథకంలో గాను కేంద్ర ప్రభుత్వం వారు 90% నిధులు విడుదల చేయగా చేనేత కార్మికులు 10% వాటాను జమ చేయడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం నిధులను చేనేత కార్మికులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇట్టి కార్యక్రమంలో ద్వారా తెలియజేయడం జరిగినది. ఇకముందు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా వారి వెన్నంటే ఉండి ఆదుకుంటానని చేనేత కళాకారులకు భరోసా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో మొదటి విడత మంజూరైన నిధులకు గాను 72 చేనేత కళాకారులకు మంజూరైన మగ్గములు మరియు పరికరంలు పంపిణీ చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమముకు శివా రెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్, రామ్ చందర్ , ఆర్డీవో,డి బాబు , సహాయ సంచాలకులు చేనేత మరియు జౌళి శాఖ, మహబూబ్ నగర్ & నారాయణపేట, జన్ను ఆంజనేయులు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చేనేత సంఘాల అధ్యక్షులు, పగడాకుల శ్రీనివాసులు, అధ్యక్షులు చేనేత సహకార సంఘం లిమిటెడ్ కోటకొండ, రాజేష్ బాబు అభివృద్ధి అధికారి, విజయ కుమార్ సహాయ అభివృద్ధి అధికారి, మాస్టర్ వీవర్లు నవలే విజయ్ కుమార్, పూడూరు శ్రీనివాసులు, కస్స రఘు, మరియు నారాయణపేట జిల్లా చేనేత కళాకారులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగినది.

