నేటి సాక్షి, గన్నేరువరం : మండలంలోని చొక్కారావుపల్లె గ్రామ ప్రజలు ఆదివారం పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. వాడ వాడలా మహిళలు ఇంటికో బోనమెత్తుకొని దప్పు చప్పుళ్ళతో, శివ సత్తుల పూనకాలు ఆటా,పాటలతో పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. బోనం లోని నైవేద్యం, పసుపు,కుంకుమ, ఓడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లా, జెల్లా, గోడ్డూ, గోద సళ్ళంగా చూడు తల్లీ అని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముస్కు కరుణాకర్ రెడ్డి , మాజీ ఉప సర్పంచ్ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, ముస్కు ఉపేందర్ రెడ్డి అనంత రెడ్డి , శ్రీకాంత్ గ్రామపెద్దలు,యువకులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.