Tuesday, March 17, 2026

చౌడేపల్లిలో చిన్నపిల్లల అమ్మకాల ముఠా సభ్యులు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 20పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో గత రెండు మూడు సంవత్సరాలనుండి ఇద్దరు ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు.ఐతే అందులో బూరగపల్లికి చెందిన అమ్మాయి ఆచూకి ఇప్పటివరకు కనుగొనలేదు. ఐతే పట్టణంలో ఒక కుటుంబం చిన్నపిల్లలను అమ్ముతున్నట్లు తెలుసున్న ఒక స్వచ్చంద సేవా సంస్థ సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు ఉత్తరాది గీత వారి పై నిఘా ఉంచి శనివారం ముఠాసభ్యులలో ఒకరిని అడుగగా నిజమేనని,ఎవరికైనా కావాలంటే ఫలాన చోట వాళ్ళతో సంప్రదించాలని తెలియజేసింది.ఈ విషయం స్థానిక పోలీసులకు, ఐసిడిఎస్ అధికారులకు పిర్యాదుచేయగా పక్కా ఆధారాలతో పట్టుకోవాలని, సదరు కుటుంబ సభ్యుల పై నిఘా ఉంచుతామని వారు తెలియజేశారు.ఈ చిన్న పిల్లల అక్రమ రవాణా పై సుమోటో గా కేసు నమోదు చేసుకొని సదరు అనుమానిత వ్యక్తుల కదలికలను,వారి ఫోన్ కాల్ డేటాను, సాంకేతికతను ఉపయోగించి, పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడం వలన నిజానిజాలు బయటకు వస్తాయని పలువులు అంటున్నారు.ఐతే ఇప్పటి వరకు మండలంలో బాలికలు చాలా వరకు కనబడలేదని వారు అన్నారు. పట్టణంలో గల సిసి కెమెరాలను పరిశీలిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని వారుతెలియజేశారు. అంతే కాకుండా బడుగు బలహీన వర్గాలైన వారిని టార్గెట్ చేసి, వారి వద్దనుండి యాబైవేలుకు కొనుగోలు చేసి,విశాఖపట్నం,విజయవాడ లలో లక్షల్లో అమ్మినట్లు పట్టణమంతా గుసగుసలు వినిపిస్తున్నాయి.కావున సంబందిత అధికారులు తక్షణం అనుమానితులను తమ ఆద్వర్యంలో తమదైన శైలిలో విచారణ ప్రారంబించి, వారి కాల్ డేటా ఆధారంగా అసలైన నిందితులను పట్టుకోవచ్చునని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News