నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 27 చౌడేపల్లి టౌన్ లో సర్కిల్ కేంద్రమైనటువంటి చౌడేపల్లి లో శనివారం సీఐ రాంభూపాల్ ఆధ్వర్యంలో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు సాయంత్రం పాఠశాలలు విడిచిన సమయంలో ఆకతాయిల ఆగడాలకు ఎవరు ఇబ్బంది పడకూడదని అలాంటి వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా సిఐ రాంభూపాల్ అన్నారు ఈ మేరకు బజారు వీధి బస్టాండు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ వరకు ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద అసాంఘిక కార్యక్రమాలు ఎవరైనా చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆ ప్రాంత ప్రజలను కోరారు పరిసరాలను నిశితంగా పరిశీలించారు చౌడేపల్లి బస్టాండ్ లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని దుకాణదారులు మట్టిని రోడ్లపై వేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకు వెళ్లడంతో పంచాయతీ కార్యదర్శి దుకాణదారులను సమావేశపరిచి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో చౌడేపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

