నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 16 పుంగునూరు నియోజవర్గం పరిధిలో చౌడేపల్లి లో మంగళవారం పుంగనూరు లేబర్ ఇన్స్పెక్టర్ మరికొందరు అధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.పట్టణంలోని ఫ్యాన్సీ స్టోర్లు స్కూటర్ మెకానిక్ దుకాణాలు టి దుకాణాలు జువెలరీ షాపులు వంటివి తనిఖీ చేశారు.ఒక ఫ్యాన్సీ స్టోర్ లో సక్రమంగా లైసెన్సు చెల్లించలేదంటూ నోటీసులు జారీ చేస్తామని లేబర్ ఇన్స్పెక్టర్ మధుబాబు తెలిపారు.అదే విధంగా అదే దుకాణంలో పనిచేసే మహిళలకు తక్కువ జీతాలు చెల్లిస్తున్నారని వారికి సైతం నోటీసులు ఇస్తున్నట్లు ఆయన వివరించారు,అదేవిధంగా బాల కార్మికులను ఎవరు పనిలోకి ఉంచుకోరాదని, ఈ సందర్భంగా తెలియజేశారు ఎవరైనా అలా చేస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు అనంతరం పలు దుకాణాలను తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కేశవరెడ్డి ఐసిడిఎస్ సూపర్వైజర్లు సులోచన రాధ పోలీసు ఏఎస్డబ్ల్యూ సిబ్బంది పాల్గొన్నారు.





