నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*చంద్రగిరి*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తోపాటు చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు చెంగల్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని .కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అందజేశారు కేంద్ర కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డిని కలిసి విద్యార్థుల సమస్యలపై విన్నవించారు.విద్యా వ్యవస్థకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించారు .కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో విద్యార్థులు, నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.





