Sunday, March 8, 2026

*జగిత్యాల అదనపు ఎస్పీకి ఎస్పీగా పదోన్నతి*శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్—–*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా విధులు నిర్వహించిన శేషాద్రిని రెడ్డి ఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పిప్పింగ్ కార్యక్రమం నిర్వహించారు.*స్టార్ చిహ్నంతో అభినందన*పిప్పింగ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శేషాద్రిని రెడ్డి భుజాలపై ఎస్పీ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. ఎస్పీగా పదోన్నతి పొందిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.*కొత్త బాధ్యతల్లో మెరుగైన సేవలు*ఈ సందర్భంగా కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ ట్రాఫిక్ డీసీపీగా బదిలీ అయిన శేషాద్రిని రెడ్డి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News