Saturday, March 7, 2026

*జగిత్యాల ఎంసిహెచ్ లో అండాశయ కణితి తొలగింపు**4 గంటలు కష్టపడి ఆపరేషన్ చేసిన డాక్టర్లు*——————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)……………………………………సుమారు నాలుగు గంటలపాటు కస్టపడి అరుదైనా ఆపరేషన్ చేసి మహిళా కడుపులోని పెద్ద కణితిని తొలగించి ఆమెను ప్రాణాపాయం నుండి రక్షించారు.జగిత్యాల ప్రభుత్వ మాత, శిశు ఆసుపత్రిలోనీ ఓబీజీ వైద్యులు అరుణ, మాధవిలు 36 వారాల గర్భిణీ పరిమాణనికి అనుగుణంగా ఉన్న ఎడమ అండాశంలో కణితితో ఉన్న 36 ఏళ్ల మహిళా కడుపులో ఉన్న పెద్ద కణితిని అన్వేషత్మాక లాపరోటమి ఆపరేషన్ చేసి తీసివేశారు.మునుపటి 3 లోయర్ -సెగ్మెంట్ సిజెరియన్ విభాగాల చరిత్ర కలిగిన గ్రావిడ ఫారా రోగి ఆసుపత్రిలో చేరగా ప్రభుత్వ డాక్టర్లు అరుణ, మాధవి లు ఎంతో కస్టపడి ఆమెకు ప్రాణాంతకoగా ఉన్న కణితిని శస్త్ర చికిత్స చేసి తొలగించి రోగినీ బ్రతికించిన సంఘటన పట్ల కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లను అభినందించారు.కడుపులోంచి తొలగించిన కణితి నిర్ధారణ కోసం హిస్టోపాథాళాజికల్ పరీక్ష కోసం పంపించినట్లు డాక్టర్లు అరుణ, మాధవిలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News