నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు.*తెలుగు వారి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి..*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రతి ఇంటిలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించే, రైతన్నను గౌరవించే గొప్ప పండుగ సంక్రాంతి అని ఆయన తెలిపారు. కొత్త ఆశలు, కొత్త వెలుగులతో ప్రజలు జీవితాలను ప్రారంభించాలని కోరారు.పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు జరుపుకునే ఈ పండుగ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత పునరుత్తేజాన్ని అందించాలని ఆకాంక్షించారు. పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా జరుపుకుంటూనే భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. కొత్త ఏడాదిలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగలు జిల్లా ప్రజలందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.____

