నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)………………………………..జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం లక్ష్మిదేవి పల్లె గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మీ మరియు 50 మంది వారి అనుచరులు కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ధర్మానాయక్ తండా నుండి చందు నాయక్ మరియు వారి అనుచరులు10 మంది కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ*రెండేళ్ల కాంగ్రెస్ పాలన లో విసుగు చెంది మళ్ళీ కేసీఆర్ వస్తేనే పల్లెలు మరియు తండా లు అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ పార్టీ నీ విడి BRS పార్టీ లో చేరడం జరిగిందని అన్నారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే స్థాయిని మరిచిపోయి సోయి తప్పి అరుస్తున్నాడు. ఫ్రస్టేషన్ తో ఎందుకు ఉకిరిబిక్కి అవుతునావ్ కేసీఆర్ అడిగింది తెలంగాణ నీళ్లను ఆంధ్ర కు ఎట్లా అప్పజెప్పిన గుట్టు బయటపడింది.కాబట్టి ప్రెస్టేషన్ తో ఉక్కిరిబిక్కిరి అవుతునావ్. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టి నిగ్గ తీసి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావ్ .డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలయాపన చేస్తున్న గురు శిష్యుల బంధం బయటపడిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తేలు రాజు.సర్పంచ్ లు సంతోష్.భారతి. చిరంజీవి, BRS నాయకులు సాగి సత్యం రావు,చిట్ల రమణ,ధరిశెట్టి రాజేష్,మారు సాయి రెడ్డి, అనంతుల గంగారెడ్డి,ఎండబెట్ల వర ప్రసాద్ భాస్కర్, బైరి మల్లేష్,జగన్ రమేష్, సాంబారి గంగాధర్,భీమా నర్సయ్య,తిరుపతి,జలంధర్, సుమన్ నాయక్,నరేష్ భాస్కర్ నాయక్, సురేష్, BRS నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

