Monday, March 16, 2026

*జగిత్యాల జ్యోతి హైస్కూల్,ఐఐటీ అకాడమీలో విద్యార్థులకు -సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు*——————————————-జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………..జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని జ్యోతి హై స్కూల్ – IIT అకాడమీలో “ *సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం*” నిర్వహించారు.ఈ కార్యక్రమం DSP రఘు చందర్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ పోలీస్ అధికారులు CI కరుణాకర్ , SI రవికిరణ్, కుమార స్వామి విచ్చేసి, విద్యార్థులకు ప్రస్తుత డిజిటల్ యుగంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాల గురించి సమగ్రంగా వివరించారు. ఫోన్ కాల్స్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్, బ్యాంకింగ్ యాప్‌లు, మరియు మోసపూరిత లింక్‌ల ద్వారా జరుగుతున్న మోసాలను గుర్తించే పద్ధతులు, వాటి నివారణ చర్యలు, మరియు బాధితులు తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి అవగాహన కల్పించారు.అలాగే విద్యార్థులు ఇంటర్నెట్ వాడకంలో జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత సమాచారం ఎవరికీ పంచుకోవద్దని, అనుమానాస్పద లింక్‌లు క్లిక్ చేయరాదని సూచించారు. చిన్న వయసులోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దాని వల్ల సమాజానికి మేలు కలగాలని ప్రేరణాత్మకంగా చెప్పారు.విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా వినిపించి, తమ సందేహాలను పోలీస్ అధికారులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరి చరణ్ రావు పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ, “విద్యార్థుల్లో సైబర్ అవగాహన పెరగడం చాలా అవసరం. ఇలాంటి కార్యక్రమాలు వారికి భద్రతా అవగాహనను పెంపొందిస్తాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ బియ్యాల హరి చరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనిక రావు, అజిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News