నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాన్వాయ్‌కు దారివ్వలేదన్న కారణంతో ట్రాలీ ఆటో డ్రైవర్‌ను పోలీసులు వేధించారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జగిత్యాల సబ్‌స్టేషన్ నుండి సామగ్రితో బయలుదేరిన ట్రాలీ ఆటో, రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఎమ్మెల్యే వాహనానికి సైడ్ ఇవ్వలేకపోయిందని డ్రైవర్ వాదిస్తున్నాడు. అయితే దీనిపై టౌన్ పోలీసులు ట్రాలీ ఆటోను ఆపి స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.*ట్రాలీ ఆటో సీజ్… స్టేషన్‌కు తరలింపు*ఎమ్మెల్యే కాన్వాయ్‌కు మార్గం కల్పించలేదనే అభియోగంతో పోలీసులు ట్రాలీ ఆటోను సీజ్ చేసి జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ క్వార్టర్స్‌లో ఉంచిన వ్యానులో తన సామగ్రి ఏదైనా పోతే పోలీస్ స్టేషన్‌పైనే కేసు వేస్తానని బాధితుడు హెచ్చరిస్తున్నాడు. తన వాహనం మరియు అందులో ఉన్న సామగ్రిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.*వైరల్ వీడియో… చర్చనీయాంశమైన ఘటన*బాధిత యువకుడు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. #jagtial #MLAsanjay #TelanganaPolice వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. పోలీసుల చర్యలు అతిగా ఉన్నాయా.? లేక విధి నిర్వహణలో భాగమా.? అన్న దానిపై నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారుల స్పందన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.______




