నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా (డీపిఆర్ఓ) జిల్లా పరిషత్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పల్లికొండ నరేష్ నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు శనివారం రోజున జగిత్యాల కలెక్టరేట్లోని జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల కార్యాలయంలో నరేష్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది శివాని, కవిత, కొండయ్య, పరశురాం గౌడ్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.—*ప్రజలకు సమాచారం చేరవేయడం ప్రధాన ధ్యేయం*బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరేష్ మాట్లాడుతూ..’ప్రభుత్వ పథకాలపై ప్రజలకు సమగ్రమైన సమాచారం చేరే విధంగా జిల్లా సమాచార శాఖ మరింత చురుకుదనంతో పని చేస్తుంది. మీడియాతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ప్రభుత్వ పథకాల ప్రభావం గ్రామీణ స్థాయిలో ప్రతిఫలించేటట్లు చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు. జిల్లాలో సమాచార ప్రసారం మరింత సమర్థవంతంగా, వేగవంతంగా ఉండేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు.*జర్నలిస్టుల అభినందనల వెల్లువ*డీపిఆర్ఓగా నరేష్ బాధ్యతలు స్వీకరించడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్), జగిత్యాల ప్రెస్ క్లబ్, మరియు వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండి ఇమ్రాన్, కార్యదర్శి రవీందర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధ్యావర సంజీవరాజు, జాతీయ కౌన్సిల్ సభ్యులు జైపాల్, రేణికుంట శ్రీనివాస్, ఆముద లింగారెడ్డి, అలాగే జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరునగరి శ్రీనివాస్ తదితరులు నరేష్‌ను అభినందించారు. సభ్యులు కొంకటి మహేంద్రనాథ్, ఆనంతుల కాంతారావు, చింత రోజా, బోరగాళ్ల లావణ్య, వీర్ల కిషన్ రావు, జవ్వాజి శంకర్, రాగం రమేష్, నక్క సతీష్, రాజలింగం, దూడ చిరంజీవి, కోరుట్ల ‘ఫ్రెండ్లీ ప్రెస్ క్లబ్’ అధ్యక్షులు చిలువేరి లక్ష్మీరాజం, ప్రధాన కార్యదర్శి కత్తిరాజ్ శంకర్, గౌరవ సలహాదారు రాధారపు నర్సయ్య లతోపాటు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సమాచార శాఖకు నరేష్ రాకతో ప్రభుత్వ–మీడియా సంబంధాలు మరింత బలపడతాయని జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.




