Thursday, March 12, 2026

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల టౌన్ (నేటి సాక్షి)(పూరెళ్ల బాపు—–(అక్టోబర్ 13):జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) స్థానిక శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ సందర్శించారు. పాఠశాల బోధన తరగతులు, భోజన వసతులు, స్టోర్ రూమ్ ,వంట గది శుభ్రత, విద్యార్థినుల ఆరోగ్య వివరాల పట్టిక ,హాజరు పట్టికను తదితర అంశాలను పరిశీలించి,విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఉపాధ్యాయులతో స్టాఫ్ రూం లో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థినుల అభ్యాసం,హాజరు,తదితర సౌకర్యాలపై అధ్యాపకులతో చర్చించి,పాఠశాలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.పాఠశాలలో వసతులు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.పాఠశాలలో వాటర్ సమస్య,డ్రైనేజీ సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ,డ్రైనేజీ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయటం జరిగింది అని,అధికారులతో మాట్లాడానని త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు.నీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేసి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు చెట్పల్లి సుధాకర్ ,చందా పృథ్వీ,బోయినపల్లి ప్రశాంత్ రావు,మాజీ కౌన్సిలర్ జుంబర్తి రాజ్ కుమార్,ప్రిన్సిపాల్ కవిత,ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News