Saturday, March 21, 2026

*జగిత్యాల పోలీస్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్**జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్‌,50 మంది పోలీసు సిబ్బందితో విస్తృతంగా ఫ్లాగ్ మార్చ్* ——————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………………………..గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛ వాతవరణంలో సాగేందుకోసం ఎస్సీ అశోక్ కుమార్ ఐపీఎస్, ఆదేశాల మేరకు డిఎస్పీ రఘు చందర్ పర్యవేక్షణలో, సిఐ సుధాకర్, జగిత్యాల రూరల్ ఆధ్వర్యంలో, జగిత్యాల రూరల్ ఎస్సై మరియు 50 మంది సిబ్బంది ఆధ్వర్యంలో విస్తృతంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించబడింది. జాబితాపూర్ మరియు లక్ష్మీపూర్ గ్రామంలోని ప్రధాన పోలింగ్ కేంద్రాలు,మరియు కీలక విభాగాలు ఫ్లాగ్ మార్ష్ నిర్వహించి ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించారు *జగిత్యాల రూరల్‌ సీఐ సుధాకర్‌ మాట్లాడుతూ* గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా శాంతియుత వాతావరణంలో జరగడానికి అన్ని బందోబస్తు విధులు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాము, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అందరూ స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని, ఏలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినా, సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఏర్పడిన డయిల్ 100 కి. ఫోన్ చేయగలరని తెలిపినారు .అలాగే ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా సాగేందుకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News