నేటి నుంచే నామినేషన్ రష్ మూడు రోజుల పాటు కొనసాగనున్న ప్రక్రియ**పట్టణ పాలన కోసం హై వోల్టేజ్ పోరు జగిత్యాల బల్దియా ఎన్నికలు హాట్**బల్దియా యుద్ధానికి రంగం సిద్ధం సమరానికి బిగ్ సిగ్నల్ జగిత్యాలలో నామినేషన్ ఫైర్*జగిత్యాల-నేటి సాక్షి ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : జగిత్యాల మున్సిపాలిటీలో నిర్వహించనున్న 2వ సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ నెల 28 నుంచి 30 తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.రెండు కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణమున్సిపల్ పరిధిలోని వార్డులను రెండు భాగాలుగా విభజించి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.వార్డు నెం.1 నుంచి 21 వరకు పోటీచేసే అభ్యర్థుల నామినేషన్లు జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో,వార్డు నెం.22 నుంచి 50 వరకు అభ్యర్థుల నామినేషన్లు విద్యానగర్‌లోని మెప్మా భవనంలో స్వీకరించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.నామినేషన్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి ఉండదని పేర్కొన్నారు.డిపాజిట్ వివరాలుఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు సమయంలో భద్రతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.SC / ST / BC అభ్యర్థులకు రూ.2,500,ఇతర అభ్యర్థులకు రూ.5,000 డిపాజిట్‌గా నిర్ణయించారన్నారు.*అర్హతలు – నిబంధనలు*అభ్యర్థి మున్సిపాలిటీ పరిధిలోని ఏదైనా ఒక డివిజన్‌లో ఓటరై ఉండాల్సి ఉంటుందని, అయితే ప్రతిపాదకుడు మాత్రం అదే డివిజన్‌కు చెందిన ఓటరై ఉండటం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాల్సి ఉండగా, ఎన్నికల ఖర్చులన్నీ ఆ ఖాతా ద్వారానే నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.పరిమితులునామినేషన్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో రెండు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, అభ్యర్థి సహా ముగ్గురు మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని తెలిపారు.అఫిడవిట్ తప్పనిసరినామినేషన్ సమయంలో అఫిడవిట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని, ఇందులోక్రిమినల్ కేసుల వివరాలు,ఆస్తులు–అప్పుల వివరాలు,ఆదాయ వనరులు,విద్యార్హత వివరాలు పొందుపరచాల్సి ఉంటుందన్నారు.ఇతర తప్పనిసరి పత్రాలునామినేషన్ పత్రంతో పాటు ఓటర్ ఐడీ లేదా ఆధార్ కార్డు,రిజర్వ్ డివిజన్ అయితే SC / ST / BC ధృవీకరణ పత్రం,ఇద్దరు ప్రతిపాదకుల సంతకాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.నామినేషన్ సమర్పించిన అనంతరం రసీదు తీసుకోవాలని, స్క్రూటినీ రోజున అభ్యర్థి లేదా అధికార ప్రతినిధి తప్పనిసరిగా హాజరుకావాలని ఎన్నికల అధికారులు సూచించారు.





