*నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )మున్సిపల్ ఎన్నికల వేళ సామాన్య ఓటర్ పేరుతో విడుదలైన కరపత్రం జగిత్యాలలో సంచలనం రేపుతోంది. గతంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో ఉండి అక్రమాలు చేసినవారు ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారని ఆరోపణలు.. పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో ఓటర్లు జాగ్రత్తగా ఆలోచించాలని విజ్ఞప్తి.!*ఊసరవెల్లి రాజకీయాలపై తీవ్ర ఆరోపణలు*జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న 35 మంది అభ్యర్థుల గత చరిత్రను ఈ కరపత్రం బహిర్గతం చేసింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 2019 మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి ఐదేళ్లు అధికారం అనుభవించిన వీరు, మున్సిపాలిటీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అక్రమాలు, దందాలు చేశారని ఆరోపణ. దీంతో 16 మంది మున్సిపల్ కమిషనర్లు మారిన ఘన చరిత్ర వీరిదే అని కరపత్రంలో పేర్కొన్నారు.*అధికార దాహంతో రంగులు మార్చుకునే ఊసరవెల్లి రాజకీయాలు*అధికార దాహంతో ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటున్నారని విమర్శ. నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్కమాట కూడా మాట్లాడని నాయకులు, నామినేషన్ రోజు కూడా మెడలో కాంగ్రెస్ కండువా లేకుండా సంచుల ముటాలు అప్పజెప్పి బీ-ఫామ్ తెచ్చుకున్నారని ఆరోపణ. ఇప్పుడు ‘మాది కాంగ్రెస్ పార్టీ’ అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.*ప్రజలకు విజ్ఞప్తి- ఓటు విలువ తెలుసుకోండి*పార్టీకి సిగ్గు లేకపోయినా, సామాన్య ప్రజలైన మనకైనా ఆలోచన ఉండాలని కరపత్రం సూచిస్తోంది. అధికార దాహం కోసం రంగు మార్చే వ్యక్తులకు విలువైన ఓటు ఇవ్వకూడదు. ఓటు రాజ్యాంగాన్ని కాపాడే ఆయుధమని, ఊసరవెల్లి రాజకీయాలను తిరస్కరించి భారత రాజ్యాంగాన్ని కాపాడే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.*వైరలవుతోన్న కరపత్రం- విచారిస్తున్న పోలీసులు*ఈ కరపత్రం విడుదలైన నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. జగిత్యాలలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. సామాన్య ఓటర్ పేరుతో వచ్చిన ఈ కరపత్రం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.!___

