Tuesday, March 10, 2026

*జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభమైన ఎన్నికల సందడి*జగిత్యాల –

నేటి సాక్షి ( ఇమ్మడి విజయ్ కుమార్ ) :జగిత్యాల పట్టణంలోని 50 వార్డులో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది..28వ తేదీ నుండి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ..31వ తేదీ పరిశీలన.. ఫిబ్రవరి మూడవ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణ జరుగుతుందని అదే రోజున తుది జాబితా ఖరారు చేస్తామన్నారు. *ఫిబ్రవరి 11వ తేదీన జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు…* 12వ తేదీన రీపోలింగ్ కోసం ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు..13వ తేదీ ఫలితాలు వెల్లడి ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు 17 రోజులు జగిత్యాల జిల్లాలోని మున్సిపల్ లలో ఎన్నికల వాతావరణం ఉంటుందని తెలిపారు.జగిత్యాల పట్టణంలో గల 50 వార్డులకు గాను రెండు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులోకౌంటర్లు 17 పెట్టామన్నారు. జగిత్యాల చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ చేయబడిందని అన్నారు.నామినేషన్ల ప్రక్రియ సంబంధించి జగిత్యాల మున్సిపల్ అధికారులు మరియు కమిషనర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.ఇక జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని రాయికల్ లో 12 వార్డులకు ఒక నామినేషన్ కేంద్రం చైర్మన్ పదవి జనరల్ గా కేటాయించారు.. *ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ స్పందన మాట్లాడుతూ* ఈనెల 28వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందనీ..ఒకటో వార్డు నుంచి 21 వ వార్డు వరకు నామినేషన్లు మున్సిపల్ కార్యాలయంలో స్వీకరించబడతాయని ఆర్వోలు కార్యాలయంలో ని మొదటి అంతస్తులో అందుబాటులో ఉంటారన్నారు.. 22వ వార్డు నుండి 50 వ వార్డు వరకు పట్టణంలోని మెప్మా కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది అందుకు సంబంధించి ఆర్వోలు అందుబాటులో ఉంటారనిహెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని అన్ని విభాగాల సమన్వయంతో నామినేషన్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేసాము..భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా పోలీసు వారు భద్రత చర్యలు తీసుకున్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News