నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)…………………………………….జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర PCC ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడువల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గట్టు సతీష్ ,మాజీ లైబ్రరీ ఛైర్మన్ డా. చంద్రశేఖర్ గౌడ్,మాజీ AMC ఛైర్మన్ దామోదర్ రావు,, సీనియర్ నాయకులు సమీండ్ల శ్రీనివాస్, బాలే శంకర్, క్యాదసు నాగయ్య, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, పట్టణ, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.టిక్కట్ల విషయంలో ఆందోళన చెంద వద్దని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని pcc ఉపాధ్యక్షులు బాల్మూరి వెంకట్ ఆశావహులకు భరోసా ఇచ్చారు.*జీవన్ రెడ్డిని కలిసిన బాల్మూరి వెంకట్*మాజీ మంత్రి జీవన్ రెడ్డిని, ఆయన ఇంటి వద్ద pcc ఉపాధ్యక్షులు బాల్మూరి వెంకట్ కలిశారు. MLA వర్గంతో సమావేశానంతరం కలిశారు. తాజా పరిస్థితులపై, కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలపై ఇద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు తెలుస్తుంది. *జీవన్ రెడ్డి వర్గానికి అందని ఆహ్వానం?*ఈ సమావేశానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి ఆహ్వానం అందకపోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు, జీవన్ రెడ్డి తన స్వంత గ్రూప్‌తో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.అభ్యర్థులపై కొనసాగుతున్న సందిగ్ధతఫిబ్రవరి 2వ తేదీ వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థుల భవితవ్యం తేలే అవకాశం లేకపోవడంతో పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.ఏ వర్గానికి ఎన్ని టిక్కెట్లు?ఏ ఏ వార్డుల్లో ఎవరికీ అవకాశం?గతంలో BRS కౌన్సిలర్లుగా ఉన్న వారికి ఎంత ప్రాధాన్యం?కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన వారికి ఎన్ని టిక్కెట్లు?అసలు కాంగ్రెస్‌కు చెందిన నాయకులకు ఎంత అవకాశం?అన్న అంశాలపై రెండు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి.పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతపరిశీలకులు బలుమూరి వెంకట్, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిసి ఆశావహులతో సమావేశం కావడం పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతకు కారణమైంది. ఈ మున్సిపల్ ఎన్నికలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.





