నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………..విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ లో విడుదల జాప్యంపై 2వరోజు జరుగుతున్న ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్.ఈ సందర్భంగా స్థానిక తహశీల్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలియజేసిన జగిత్యాల జిల్లాకు చెందిన వివిధ ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ కొక్కుల రాజేందర్, నలంద డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి సురేష్ మరియు NSV డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ గోపు మునిందర్ రెడ్డి, మల్లికార్జున్ మరియు వివిధ కళాశాలల అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు.





