నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………………………….. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ వారోత్సవాల భాగంగా విద్యుత్ ప్రమాదాలపై అవగాహన *విద్యుత్ పట్టణ బాట* కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ పట్టణ బాట కార్యక్రమంలో భాగంగా స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద విద్యుత్ వినియోదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఇనుప వైర్లు పై బట్టలు గాని ఇతరత్రా ఆరబెట్టుకోకూడదని అలా చేయడంవల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అందుకాను ప్లాస్టిక్ తో కూడిన వైర్లను ఏర్పాటు చేసుకొని బట్టలు గాని ఆరబెట్టుకోవాలని కోరారు. విద్యుత్ ప్రమాదాలు గానీ ఇతరత్రా ప్రమాదంలో జరిగిన వెంటనే విద్యుత్ అధికారులకు, లైన్మెన్ లకు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యుత్ అధికారులు 24/7 అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ADE జవహర్ లాల్, నాయక్ రాంజీ, ఏఈ. సతీష్, అనూష, ప్రకాష్. ఉదయ్, శ్రీనివాస్, ప్రసాద్. మాజీ కౌన్సిలర్ ACS. రాజు, మాజీ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ యం.డి. సెమియోద్దీన్, విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.





