నేటి సాక్షి – జగిత్యాల టౌన్ ( పూరెళ్ల బాపు)……………………………………..జగిత్యాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం కలకలం రేపింది. సైబర్ క్రైమ్ కేసులో రిమాండ్‌లో ఉన్న నిర్మల్ జిల్లా వాసి కొత్వల్ కృష్ణ (43)కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.జైల్లో ఉన్న సమయంలో ఈ రోజు ఉదయం సుమారు 8 గంటల సమయంలో కృష్ణకు తీవ్ర గుండెనొప్పి రావడంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది వెంటనే అతడిని జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటిలోనే మృతి చెందినట్లు ధృవీకరించారు.మృతుడి సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని విషాదంలో మునిగిపోయారు. ఘటనపై జైలు అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

