Friday, March 13, 2026

జడ్పీహెచ్ఎస్. పాములపాడు లో క్రీడాకారులకు పోటీలు మరియు ప్రతిభావంతుల ఎంపిక..పాములపాడు అక్టోబర్ 22

నేటి సాక్షి:–.. స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ పాములపాడు నందు 22/ 10 /2025వ తేదీ నాడు ఉదయం 9 గంటలకు మండలము లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు యాజమాన్య పాఠశాలల, క్రీడాకారులకు పాములపాడు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్ జి ఎఫ్) వారి ఆధ్వర్యంలో వివిధ రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించబడును . కోకో , కబ్బడి, చెస్, యోగా, షటిల్ బ్యాట్ మింటన్, మరియు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను ఆత్మకూరు డివిజన్ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేయబడును. కావున పోటీల్లో పాల్గొనే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పి ఈ టి లు మరియు పిడి లకు తెలియజేయడమేమనగా పోటీల్లో పాల్గొనే విద్యార్థుల క్రీడా లిస్టును మరియు మిడ్ డే మీల్స్ సంబంధించిన ఫారమ్స్ ను మీవెంట తీసుకు రాగలరు…… D. బాలాజీ నాయక్ ఎంఈఓ 1గారు, A.సుభాషిని దేవి ఎంఈఓ 2గారు,N.శ్రీధర రెడ్డి హెచ్ఎం గారు K.రాజశేఖర్ గారు పిడిఎస్ జి ఎఫ్ పాములపాడు మండల కో ఆర్డినేటర్ పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News