Saturday, March 7, 2026

జనం వీడి వనంలోకి నాగులమ్మ ఐదు రోజులుగా సాగిన మహా జాతర వన ప్రవేశంతో ముగిసిన నాగులమ్మ మహా జాతర

నేటిసాక్షి /ములుగు ప్రతినిధి/మంగపేట ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల లక్ష్మీనర్సాపూర్ గ్రామంలో ఐదు రోజుల పాటు శ్రీ నాగులమ్మ మహా జాతర అంగరంగ వైభవంగా ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా జరిగింది.ఐదు రోజుల పాటు జరిగిన జాతరలో ములుగు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ మహారాష్ట్ర రాష్ట్రల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై నాగులమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు మొక్కులు చెల్లించుకున్నారు జాతరలో చివరి రోజున మణి రూపంలో ఉన్న నాగులమ్మ అమ్మవారికి ,సడాలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన పూజారులు గండోర్రె గుట్టకు నాగులమ్మ ను,ఎర్రట్టల గుట్ట కు సడాలమ్మ ను డోలు వాయిద్యాల నడుమ జనం నుండి వనానికి సాగనంపారు.ఈ సందర్భంగా భక్తులు చల్లగా కాపాడమని నాగులమ్మ ను వేడుకున్నారు.అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగిసింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మేనేజింగ్ ట్రస్టీ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామి ,పూజ కార్యక్రమాలను పర్యవేక్షించగా నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారి బాడిశ నాగరమేష్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించగా పూజారులు సోడి సత్యం,కుర్సం పుల్లయ్య, కట్టం సమ్మక్క,చౌళం భవాని,మడకం సుప్రజ,పోలిశెట్టి స్వరూప,వడ్డెలు కోర్స శ్రీకాంత్ ,మూయబోయిన శివ,తుర్స చిన్నబ్బాయి,కారం రాజేష్ పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కులపెద్దలు కుర్సం విష్ణుమూర్తి,మడకం రాజేశ్వర్ రావు,చౌళం వెంకటేశ్వర్లు ,కొమరం మాధవ రావు,కొమరం పాపారావు,ఇరప రామకృష్ణ,ఇందారపు రమేష్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News