Tuesday, March 10, 2026

జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా “డాక్టర్స్ డే” వేడుకలు….

నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని జనయేత్రి ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్. మునీర్ అహ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో
మంగళవారం “డాక్టర్స్ డే” వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యకమనికి ముఖ్య అతిధిగా డా.డిప్యూటీ డిఎంహెచ్ఓ కేస రవి విచ్చేశారు. ఈ సందర్భంగా డా. మునీర్, డాక్టర్స్ కు చిరు సన్మానం చేసి, వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సీనియర్ డాక్టర్. జె.రాజు మాట్లాడుతూ, ‘డాక్టర్స్ డే’ విశిష్టతను తెలియజేస్తూ, ప్రతి వైద్యులు కూడా వైద్యంతో పాటు, సమాజానికి ఎంతో కొంత సేవ చేయడానికి ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో
డాక్టర్స్ ఇంటూరు శ్రీనివాస్ రెడ్డి, బాలాజీ, తులసీరామ్ ముస్తాక్ అహ్మద్, విజేందర్, నాగు, బసవ పున్నారావు, రోహిత్, చక్రవర్తి, మోఈజ్, రఫీ, శ్రీనివాసరాజు, చక్రవర్తి నాగేశ్వరరావ్, మహేష్ కుమార్, నాగు నాయక్, వికాస్, జాఫర్, ఝాన్సీ లక్ష్మీబాయి, స్వాతి, భవాని రెడ్డి, వహీదా బేగం, జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ అహ్మద్, కార్యదర్శి తాజ్ బాబా, కార్యనిర్వాహక అధ్యక్షులు కొమరోలు యాదగిరి, మరియు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News