నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )………………………………….ఓటరు జాబితా సవరణ, మ్యాపింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల నియోజకవర్గ ఓటరు జాబితా మ్యాపింగ్ అవగాహన సదస్సు లో మంగళవారం అయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను నూతన ఓటరు జాబితాలలో జనవరి 13 నాటికీ పూర్తి చేయాలన్నారు. ఓటరు జాబితా తప్పులు లేకుండా సమర్థవంతంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఆర్ డి ఓ మధుసూదన్ తదితరులు ఉన్నారు.





