Saturday, March 21, 2026

జనసేన ఇంచార్జ్, కూటమి నాయకులు రాకతో జనసంద్రమైన అంగళ్లు..అంగళ్లు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పోతుల సాయినాథ్..అర్హులకి పక్కాగా ఇళ్ల పట్టాలు అందేలా చూడాలని అధికారులకు కీలక ఆదేశాలు.. జనసేన ఇంచార్జ్

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 03 ~అన్నమయ్య జిల్లా :-: తంబళ్ళపల్లి నియోజకవర్గ పరిధిలోని కురబలకోట మండల కేంద్రమైన అంగళ్లు లోని గ్రామ సచివాలయాన్ని తంబళ్ళపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం గ్రామ సచివాలయంలోని ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతి లబ్ధిదారులకు చేకూరాలని పేద ప్రజలకు అన్ని విధాలుగా సహకరించాలని అన్ని శాఖల అధికారులకు విన్నవించారు. పేదలందరికీ లబ్ధి చేకూరాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన గృహ నిర్మాణం కొరకు దరఖాస్తులు చేసుకున్న ప్రజలతో మమేకమయ్యారు. ఈ మేరకు వారికి వివరాలను సూచిస్తూ సచివాలయం ద్వారా ఏదైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. ఏ అధికారి ప్రజల మాట కాదన్నారో వారి వివరాలను తమకు అందించాలని తక్షణమే అధికారిపై చర్యలు తీసుకుంటామని స్థానికులకు సాయినాథ్ తెలిపారు. అంగళ్లు పంచాయతీకి సంబంధించి గృహ నిర్మాణం లో స్థలం లేని వారికి అంగళ్లు చుట్టుపక్కల భూమిని కేటాయించాలని అన్ని విధాలుగా ప్రజలకు దగ్గరగా ఉన్నట్లు స్థలాలు కేటాయించాలని స్థలం ఉన్న వారికి అర్హులకి పక్కాగా ఇళ్ల పట్టాలు అందేలా చూడాలని సాయినాథ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News