నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన బొప్పల జమున గతంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించిన జమున గారికి జనసేన పార్టీ తరఫున ఐదు లక్షల బీమా చెక్కును మంగళవారం హైదరాబాద్ కూకట్ పల్లిలో జనసేన పార్టీ కార్యాలయలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమురి శంకర్ గౌడ్ గారు,కరీంనగర్ ఇన్చార్జ్ ఆర్కే సాగర్ గారు, మహిళా చైర్మన్ విభాగం అధ్యక్షురాలు కావ్య గారు, మరియు జనసేన పార్టీ నాయకులు బోయ జమ్మన్న,రఘు,పరుశరాముడు, మహబూబ్ సమక్షంలో జుమున వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల బీమా చెక్కును అందజేయడం జరిగింది. అదేవిదంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఈ 2025వ సంవత్సరం 608 మందికి చేయించుకున్న వారికీ కిట్లను పంపిణి చేయడం జరిగింది.
ఐదు లక్షల చెక్కును అందుకున్న జమున కుటుంబ సభ్యులు ఏపీ డూప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికీ పార్టీ ముఖ్య నాయకులకు బోయ జమ్మన్న గారికీ ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ… జనసేన పార్టీకి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు.

