Thursday, March 26, 2026

*జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ఆర్థిక భరోసా*- మృతిచెందిన జనసేన‌ సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షలు చెక్కు అందజేత* అందజేస్తున్నజనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం) జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా ఉన్న హుకుమతిరావు నాగంజనేయులు జనసేన పార్టీ కార్యకర్త అలాగే జనసేన సభ్యత్వం తీసుకున్న వ్యక్తి కి ఆదివారం జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికులు కుటుంబాలకి జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు చేతుల మీదుగా బాపట్ల నియోజకవర్గానికి చెందిన హుకుమతిరావు నాగంజనేయులు కుటుంబానికి ప్రమాద బీమా 5లక్షలు రూపాయల చెక్కును అందించారు.అలాగే వివిధ ప్రమాదాలలో మృతి చెందిన వారి కుటుంబాలకు పార్టీ తరుపున ఆర్థిక సాయం అందజేశారు. పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో పనిచేసే కార్యకర్తల కుటుంబాల భరోసా కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన యజ్ఞంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉండటంతో వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ రూ.5 లక్షలు చెక్కును అందజేశారు.. బాపట్ల జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్, హుకుమతిరావు నాగంజనేయులు, వారి భార్యను అన్నపూర్ణ కన్వెన్షన్ హాలుకు తీసుకువెళ్లి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు చేతుల మీదగా చెక్కులు ఇప్పించారు. వారి కుటుంబ సభ్యులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి జనసేన నాయకులు విన్నకోట సురేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 220 మంది క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.11 కోట్లు ఈ విధంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, బాపట్ల నియోజకవర్గ జనసేన నాయకులు పసుపులేటి మహేష్, గరిగంటి శ్రీనివాసరావు, సాయిన రాంబాబు, గుర్రాల రామారావు,రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News