Friday, March 6, 2026

జనాలగూడెం బాధితులకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేసిన పి.వి.రావు మాల మహానాడు కమిటీ కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి.వెంకటేష్……..

నేటి సాక్షి 09 ఫిబ్రవరి కొత్తపల్లి:- కొత్తపల్లి మండలంలోని, జానాల గూడెంలో గత నెలలో అగ్రవర్ణాల కుట్రలో భాగంగా దళితులను అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది. వారి కుటుంబాల బాధితులకు అండగా పి.వి.రావు మాల మహానాడు కమిటీ కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి.వెంకటేష్, తదితర నాయకులు పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడమే కాకుండా, న్యాయపరంగా బాధితులకు అండగా ఉంటామని మాల మహానాడు నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం జనాల గూడెం బాధితులకు కొంతమంది దాతల సహకారంతో నిత్యవసర వస్తువులు, కూరగాయలు మాల మహానాడు నాయకులతో కలిసి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాములపాడు మండలం నుండి మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.చిన్న అంకన్న, సమాజ సేవకుడు కలబండి.నాగరాజు, జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల.అబ్రహం, మిత్తూరు మండలం నాయకులు దేవ, నాగరాజు, జూపాడుబంగ్లా మండలం నాయకులు మాధవరం రంగస్వామి, పి.రంగయ్య, కొత్తపల్లి మండలం నాయకులు మల్రెడ్డి రవికుమార్, మధు, అరే రాజు,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News