Tuesday, March 10, 2026

జన్మదిన కానుకలుగా మొక్కలు

తపస్ జిల్లా అధ్యక్షులు షేర్ కృష్ణారెడ్డి పంపిణీ

నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 26,

నారాయణపేట
తపస్ జిల్లా అధ్యక్షుడు షేర్ కృష్ణారెడ్డి తన కుమారుడు గురుచరణ్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం వలే ఆనవాయితీగా
పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ ప్రాథమిక మరియు ప్రాథమిక పాఠశాల జాజాపూర్ పాఠశాలలో మొక్కలు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముక్కలే జీవానికి ప్రాణాధారమని వాటిని పెంచితేనే మనుగడ
స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు.
తన కుమారుని జన్మదిన సందర్భంగా గత దశాబ్ద కాలంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భారతి, పద్మజ ఉపాధ్యాయులు మధు, భాను ప్రకాష్ విజయ, లక్ష్మణ్, నిర్మల శశిరేఖ శ్రీదేవి మంగళ ప్రతాప్ నరసింహ, విశ్వనాథరెడ్డి, బాలకృష్ణ, గీత,రజిత,
రఘు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News