Saturday, March 14, 2026

జన్మదిన వేడుకలకు దూరంగా కొటాల చంద్రశేఖర్ రెడ్డి.

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)“నేడు నా జన్మదినం. అయితే మన నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కుటిల రాజకీయాలతోఅక్రమ లిక్కర్ కేసులో జైలులో ఉన్నందున నేడు (24) తేదీన ఆ భగవంతుని ఆశీస్సులతో బెయిల్ పై కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో, నా జన్మదిన వేడుకలను జరుపుకోకుండా ఉండాలని నిర్ణయించుకున్నాను.ప్రతి సంవత్సరం చంద్రగిరి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నా జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలుపుతుంటారు. అయితే, రేపు నేను విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద ఉండబోతున్న సందర్భంగా నన్ను ప్రత్యక్షంగా కలిసేందుకు లేదా శుభాకాంక్షలు తెలిపేందుకు రావద్దని నా బంధుమిత్రులకు,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులకు మనవి చేస్తున్నాను.మన నాయకుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు అయిన రోజే నాకు నిజమైన జన్మదినోత్సవం అవుతుంది.” *మీ కొటాల చంద్రశేఖర్ రెడ్డి**చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు*

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News